ఎన్ఎల్ఎం స్కీం కి అప్లై చేయాలా? అర్హత వివరాలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి..!

-

భారత దేశ కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఉండే నిరుద్యోగులకు మరియు వ్యాపరస్తులకు ఉపాధి కల్పించడానికి ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతూ వస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. యానిమల్ హస్బెండరీ మరియు డైరీయింగ్ డిపార్ట్మెంట్ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో ఉండే వారికి ఆర్థిక సహాయం అందించేందుకు మరియు ఉపాధి కల్పించేందుకు వీలుగా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. గొర్రెలు, మేకలు, పందులు, కోడులు వంటి మొదలైన వాటిని పెంచడానికి ఆసక్తి ఉన్న వారికోసం ఈ పథకాన్ని తీసుకువచ్చారు.

అర్హత వివరాలు:

ఎన్ఎల్ఎం ఎంటర్ప్రెన్యూర్షిప్ పధకంలో రైతులు, ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ (ఎస్ హెచ్ జి ), ఫార్మర్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ సి ఓ), జాయింట్ లయబిలిటీ గ్రూప్ (జే ఎల్ జీ) మరియు సెక్షన్ 8 కంపెనీలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేయాలి:

ఈ పథకానికి అర్హులు అయిన వారు పాన్ కార్డ్ లేక ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ట్రైనింగ్ సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, ఫోటో, బ్యాంక్ స్టేట్మెంట్ వంటి మొదలైన డాక్యుమెంట్ లను అప్లికేషన్ లో భాగంగా నమోదు చెయ్యాలి. జాయింట్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ వంటి వారు రైతుల వివరాలు మరియు అభ్యర్థి వాటాకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి. ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ కొరకు ఈ డాక్యుమెంట్ లు అన్నీ అవసరం మరియు ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంక్ లేక ఆర్థిక సంస్థలలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. దీనికి సంబంధించిన పోర్టల్ https://www.nlm.udyamimitra.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎన్ఎల్ఎం పధకం ప్రయోజనాలు:

ఎన్ఎల్ఎం పధకం ద్వారా రాయితీను ఎక్కువగా పొందవచ్చు. కోడులను పెంచే వారికి 25 లక్షల వరకు రాయితీ ఉంటుంది. మేకలు, గొర్రెలకు 50 లక్షలు. పందులకు 30 లక్షలు మరియు మేతకు అయితే 50 లక్షలు వరకు రాయితీ వస్తుంది. కానీ ఈ పథకంలో భాగంగా ఎటువంటి భూమిని కొనుగోలు చేయడం, అద్దెకు లేక లీజుకు డబ్బులను ఉపయోగిస్తే రాయితీ ఉండదు. అంతేకాక వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించినా రాయితీ అనేది ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news