జగన్ నివాసం వద్ద స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నివాసం వద్ద పోలీసులు నిఘా పెంచారు. భద్రత చర్యల్లో భాగంగా మొత్తం 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/jagan-1.webp)
వీటిని తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లోని మానిటర్ కు అనుసంధానించారు. వై సీ పీ కార్యాలయం ఎదురుగా ఉన్న గార్డెన్‌లో గడ్డి తగలబడి మంటలు చెలరేగిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీ లను పోలీసులు సేకరించారు.
అటు వైసీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీసీ ఫుటేజ్ ఇవ్వాలంటూ వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. జగన్ ఇంటి వద్ద మంటల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు ఎలా అంటుకున్నాయో తేల్చేందుకు దర్యాప్తు చేపడుతున్నారు తాడేపల్లి పోలీసులు. ఈ తరునంలోనే.. నోటీసులు ఇష్యూ చేశారు.