యాక్ట్ 1/70 మార్చే ఆలోచన లేదని తెలిపారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. యాక్ట్ 1/70 మార్చే ఎలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదని.. 1/70 యాక్ట్ ను పరిరక్షిస్తామని వెల్లడించారు. ఆదివాసి చట్టాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని… గిరిజనులు ఆందోళన చెoదవద్దని కోరారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. వైసీపీ నేతలు విషప్రచారo చేస్తూ అసత్యాలు చెప్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/Gummidi-Sandhyarani.webp)
గిరిజనులకు మెరుగైన సంక్షేమం అందిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని.. వివరించారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. 5ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ గిరిజనుల జీవితాలతో ఆడుకున్నాడని… అటవీ ప్రాంతాలను గంజాయికి అడ్డాగా మార్చిన వైసీపీ నేతలు గిరిజనుల ఉపాధికి గండి కొట్టారన్నారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చటంతో పాటు గిరిజనులకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి.