తెలంగాణ అసెంబ్లీలో నిర్వహించిన పీఏసీ( పబ్లిక్ అకౌంట్స్ సమావేశం) గందరగోళానికి దారితీసింది. దీనికి హాజరైన ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతుండగా పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ మైక్ కట్ చేశారు. ఈ క్రమంలోనే పీఏసీ చైర్మన్‌గా అరెకపూడి గాంధీ నియామకాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు ఈ సమావేశాన్ని బహిష్కరించారు.
పీఏసీ సభ్యులైన వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎల్ రమణలు నిరసన తెలిపి సమావేశం మధ్యలోనే బహిష్కరించారు. అనంతరం మీటింగ్ హాట్ నుంచి బయటకు వచ్చి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో అరికెపూడి గాంధీ చైర్మన్‌గా ఉంటారో..లేదో తెలియదన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోందని చెప్పారు. పీఏసీ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని, అలాంటప్పుడు పార్టీ మారిన వ్యక్తికి ఎలా ఇస్తారని గులాబీ నేతలు మండిపడ్డారు.