మెట్రో రైలు విస్తరణ పై తెలంగాణ హై కోర్టులో పిల్ దాఖలు అయ్యింది. పలు చారిత్రక కట్టడాలను పరిగణలోకి తీసుకోకుండా ఈ నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఏపీడబ్ల్యూఎఫ్ పిల్ దాఖలు చేసారు. అయితే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, మెట్రో రైలు ఎండీ, వక్ఫ్ బోర్డు సీఈవో ను పిటిషనర్ ప్రతివాదులుగా ఇందులో చేర్చారు.
అయితే తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ 2017 ప్రకారం చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సి ఉందన్నారు పిటిషనర్. కానీ పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణం వల్ల చార్మినార్, ఫలక్ నామా ప్యాలెస్, పురాణాహవేలీ, మొఘల్ పుర సమాధులు వంటి చారిత్రక కట్టడాలు దెబ్బతినే ప్రమాదం ఉంది అని పిటిషనర్ తెలిపారు. అలాగే ఈ మెట్రో డిజైన్లను హై కోర్టు లేదా నిపుణుల బృందం ఆమోదించిన తర్వాతే ముందుకు వెళ్లాలని కోరారు పిటిషనర్. ఇక ఈ పిటిషన్ పై తదుపరి విచారణను హై కోర్టు ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.