హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో బుధవారం పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబర్ లో కూడా టీడీపీ సభ్యత్వాలు జరగనున్నాయన్నారు. మే లోకడపలో టీడీపీ మహానాడు జరుగుతుందని ఆయన తెలిపారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో కోటి సభ్యత్వాలు పూర్తి కావడం సంతోషకరమని ఆయన తెలిపారు. ఢిల్లీలోను లోకేష్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులతో చర్చలు సాగిస్తూ రాష్ట్ర వృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
మార్గదర్శి సంస్థకు సంబంధించి మిథున్ రెడ్డి వ్యాఖ్యలు సరైనవి కాదని, మార్గదర్శిపై ఆయన పార్లమెంట్ లోపల, బయట తప్పు ప్రచారం చేశారన్నారు. 1995లో నా తొలి వేతనం 50వేలతో చిట్టి కట్టానని, 1996 లో చిట్టి పాడి వ్యవసాయ భూమి కొనుగోలు చేసామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికి మార్గదర్శి చిట్స్ కొనసాగిస్తున్నామని, 2006 లో ఇలాగే మార్గదర్శి పై అధికార బలంతో తప్పుడు ప్రచారం చేశారన్నారు.