తెలంగాణ సెక్రటేరియట్ పెచ్చులు ఊడిన ఘటనపై స్పందించిన నిర్మాణ సంస్థ !

-

తెలంగాణ సెక్రటేరియట్ పెచ్చులు ఊడిన ఘటనపై స్పందించింది శాపూర్ జీ పల్లోంజి నిర్మాణ సంస్థ. గత కొన్ని నెలలుగా సచివాలయం 5, 6 అంతస్తుల్లో మరమ్మత్తులు, మార్పులు జరుగుతున్నాయని చెప్పింది శాపూర్ జీ పల్లోంజి నిర్మాణ సంస్థ. ఐదో అంతస్తులో పనిచేస్తున్న సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో పెచ్చులు ఊడిపడ్డాయని క్లారిటీ ఇచ్చింది.

రెగ్యులర్ డిపార్ట్మెంట్ వర్క్స్ లో భాగంగా కేబుల్, లైటింగ్ కోసం కూడా పనులు చేస్తున్నారని చెప్పింది శాపూర్ జీ పల్లోంజి నిర్మాణ సంస్థ. నిర్మాణ ప్రాబ్లం కాదు.. అది కాంక్రీట్ వర్క్ కాదు, స్ట్రక్చర్‌కు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఊడి పడింది జీఆర్సీ ఫ్రేం అని వెల్లడించింది. డ్రిల్ చేస్తే GRC డ్యామేజ్ అవుతుంది… స్ట్రక్చర్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు అవుతుంది.. ఎలాంటి నాణ్యత లోపం లేదని క్లారిటీ ఇచ్చింది శాపూర్ జీ పల్లోంజి నిర్మాణ సంస్థ. మేము ఈ ఘటన పై రివ్యూ చేస్తున్నామని తెలిపింది శాపూర్ జీ పల్లోంజి నిర్మాణ సంస్థ.

Read more RELATED
Recommended to you

Latest news