తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే మారనుందని చెప్పారు.
ఇక రాష్ట్రంలో మరోసారి కులగణన వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభంపై ఆయన స్పందిస్తూ.. ఇప్పుడు నిర్వహించేది రీ సర్వే కాదని.. కొంత మంది తమ సమాచారం ఇవ్వకపోవడం వలన ఈ నెల 28 వరకు మరోసారి గడువు ఇచ్చినట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామని మంత్రి పొన్నం స్పష్టంచేశారు. ప్రజల అకాంక్షలకు అనుగుణంగా రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. కాగా, సమగ్ర సర్వేలో పాల్గొనకుండా గులాబీ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు.