kodi pandalu in Karimnagar: కరీంనగర్ లో కోడిపందాల కలకలం చోటు చేసుకుంది. తాజాగా కోడిపందెంలో గాయపడిన పుంజును ఆసుపత్రి కి తీసుకువచ్చాడు ఓ వ్యక్తి. కాక్ ఫైట్ లో మెడ తెగి రక్తస్రావం అవుతున్న కోడిని వైద్యం కోసం తీసుకురావడంతో కోడి పందేలు జరుగుతున్న ప్రచారం జరుగుతోంది. గత కొన్ని నెలలుగా కరీంనగర్ నగర శివారులో కోడిపందాలు జరుగుతున్నట్లు ప్రచారం మొదలైంది. ఫాంహౌస్ లు,చెట్లపొదలని స్థావరాలుగా చేసుకొని పోటీలు నిర్వహిస్తున్నారట కొందరు వ్యక్తులు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/Untitled-1-44.jpg)
వారంతాలు సెలవు రోజుల్లో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కరీంనగర్ కి వచ్చి పలు వ్యాపారాలు చేస్తున్న కొందరు వ్యక్తులు స్థానిక రాజకీయ నాయకుల అండతో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చూసి చూడనట్లు వ్యవ హరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.