తెలంగాణలో వేసవి ఇంకా రాకముందే మంచి నీటి వెతలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలోని మారుమూల పల్లెల్లో ఈ సమస్య తలెత్తింది అనుకుంటే పొరపాటే. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే నీటి ఎద్దడి నెలకొంది. దీంతో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్నారు.
కొడంగల్ నియోజకవర్గం టేకుల్ కోడ్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదని గురువారం ఉదయం ఖాళీ బిందెలతో మహిళలు ధర్నాకు దిగారు.వారికి ఊరి ప్రజలు కూడా తోడయ్యారు. వెంటనే తమకు మిషన్ భగీరథ నీళ్లు వచ్చేలా చూడాలని స్థానిక కాంగ్రెస్ లీడర్లను, అధికారులను మహిళలు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ నియోజకవర్గంలోనే ఇలా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో, మారుమూల పల్లెల్లో నీటి సమస్యలపైనా అధికారులు ఫోకస్ పెట్టాలని, ప్రభుత్వం స్పందించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
https://twitter.com/TeluguScribe/status/1889910765391585744