ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మస్తాన్ సాయి వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.అతని మీద డ్రగ్స్, లైంగికదాడి,బ్లాక్ మెయిలింగ్, సైబర్ నేరాల కిందట తెలంగాణ పోలీసులు కేసులు పెట్టారు.హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు అయిన లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని పోలీసులు అరెస్టు చేయగా.. అతని వద్ద గల హార్డ్ డిస్కులో 1500లకు పైగా న్యూడ్ వీడియోలు, డ్రగ్స్ పార్టీలకు సంబంధించిన వీడియోలను గుర్తించారు.
దీంతో మస్తాన్ సాయిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ఎదుట హాజరు పరచగా అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా అతన్ని మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇస్తూ శుక్రవారం ఉదయం రాజేంద్రనగర్ కోర్టు అనుమతులు ఇచ్చింది.దీంతో మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అతన్ని విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోనున్నారు.
https://twitter.com/ChotaNewsApp/status/1890254588751847914