స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

-

 

ఈ మేరకు ఇవాళ ఆయన బంజారాహిల్స్ లోని కంట్రోల్ కమాండ్ సెంటర్ లో విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం
నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా
రెసిడెన్షియల్ స్కూల్స్ స్థలాల సేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

దాదాపు 105 నియోజకవర్గాల్లో అనుకున్న సమయంలోగా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులు కేటాయింపు పూర్తి చేసేలా పనిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల్లో స్థలాల పూర్తి అయితే, ఇతర పర్మీషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. స్కూళ్లకు కేటాయించిన స్థలాలు నిర్మాణాలకు అనువైనవా లేదో నిపుణుల ద్వారా సర్వే చేయించాలని తెలిపారు. ఒకవేళ నిర్మాణాలకు అనువు కాని పక్షంలో మరోచోట స్కూళ్ల నిర్మాణానికి స్థలాన్ని సమీకరించాలని అన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో విజిట్ చేసి యుద్ధ ప్రాతిపదికన స్థలాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news