డస్ట్ ఎలర్జీ రావడానికి అసలు కారణాలు ఇవే.. ఇలా చేస్తే ఈజీగా తగ్గించుకోవచ్చు..!

-

ఈరోజుల్లో ఎక్కువ మందికి డస్ట్ ఎలర్జీ వస్తుంది. మిగత ఎలర్జీలకంటే..ఇదే ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి పోలిన్స్..గడ్డినుంచి, పూలనుంచి ఎలర్జీలు వస్తాయి. కొన్ని రకాల కెమికల్స్ వాసన పీల్చినా ఎలర్జీలు వస్తాయి. మరికొంతమందికి..పెంపుడు జంతువుల వల్ల..వాటి వెంట్రుకలు, పొల్యూషన్ వల్ల ఎలర్జీలు వస్తాయి. ఈరోజు మనం..ఎలర్జీలు రావడానికి కారణాలు, నివారణ చర్యలు తెలుసుకుందాం..

మనం పీల్చిన గాలిలో ఉండే..ధుమ్మూ, ధూళి, కెమికల్స్, డస్ట్ మైట్స్ ఇవన్నీ..ముక్కులోపలకు వెళ్లిన వెంటనే..ముక్కులో ఉండే వెంట్రుకలు వాటిని దాదాపు ఆపుతాయి..వాటిని దాటుకొని కూడా కొన్ని బాడీలోకి వెళ్తాయి. ముక్కులోపల భాగంలో అంచులవైపు జిగురు ఉంటుంది. ఆ జిగురుకు అంటుకుపోయి..చాలా ఫిల్టర్ అవుతాయి..ఇంకా లోపలకి వెళ్లబోతున్నాయి అంటే.. ఇక్కడ తుమ్ము సృష్టించి బాడీ ఇలా బయటకు వస్తాయి..ఇన్నింటిని తప్పించుకుని బాడీలోకి వెళ్లినాయి అంటే.. ఊపిరితిత్తుల్లోకి వెళ్తే.. లంగ్స్ లో ఉండే సీలియాక్ పట్టుకుంటుంది. ఆ జిగురు ద్వారా.. కఫం రూపంలో బయటకు వస్తాయి.. ఇంకా లోపలకి వెళ్లి లంగ్స్ రూపంలో సెటిల్ అవుతాయి.. దాన్ని బయటకు పంపడానికి ఎలర్జీలు వస్తాయి.. ఇన్ని ఫిల్టర్స్, ఇంత క్లీన్ చేసే మెకానిజం ఉన్నప్పటికీ డస్ట్ మైట్స్.. చర్మం మీద వాలితే.. చర్మంపైన ఉండే.. చచ్చిపోయిన కణజాలం పొరను తినేసి బ్రతుకుతాయి.

ఇవి తిని పెరిగి పెరుగుతూ.. గాలి ద్వారా కూడా ఒకరినుంచి ఒకరికి వ్యాపిస్తాయి. ఇవన్నీ లోపలకి వెళ్లిన తర్వాతా..లంగ్స్ ఉండే రక్షణవ్యవస్థ, శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. ఈ డస్ట్ పార్టికల్స్ ను బయటకు పంపించాలంటే..శ్లేష్మాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. శ్లేష్మంలో వీటిని పెట్టి బయటకు పంపించాలి. మరి ఈ శ్లేష్మం బయటకు రావాలంటే..దగ్గు రావాలి. కొంతమందికి ఈ శ్లేష్మం ఎక్కువ తయారైతే..పిల్లికూతలు, మరీ ఎక్కువ తయారైతే..ఆస్థమా కూడా వస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ అయి..ఈ డస్ట్ ను అంతా బయటకు పంపించేందుకు చేసే చర్యలే ఎలర్జీ.

లోపలకి ఈజీగా వెళ్లినాయి..బయటకు ఈజీగా రాలేవు..అందుకే శ్లేష్మం ద్వారా పంపిస్తుంది..కొంతమందికి ఈ డస్ట్ లోపలికి ఎక్కువగా వెళ్లిపోయి ఇమ్యూన్ సిస్టమ్ బాగా సెన్సిటివ్ అయిపోయి అతిగా స్పందించాల్సి వస్తుంది. ఎక్కువ ప్రొడెక్షన్ వస్తుంది. తక్కువ ధుమ్ము లోపలికి వెళ్లినా..ఎక్కువ తుమ్మటాలు..ఎక్కువ ఎలర్జీతో బాధపడతారు. కానీ కొంతమంది రోడ్డుపక్కన పనిచేసేవాళ్లు ఉంటారు..పైప్ లైన్స్ పనిచేసేవాళ్లు పొగలన్నీ పీలుస్తారు..వాళ్లకు డస్ట్ ఎలర్జీలు ఎక్కువగా రావాలి..కానీ వాళ్లకు అది రోజు అలవాటై..బాడీ ఈజీగా గెంటేస్తూ..ఇమ్యూన్ సిస్టమ్ యాక్టీవ్ గా ఉంటుంది కాబట్టి..అతిగా స్పందించదు. వాళ్లకు డస్ట్ ఎలర్జీ అంత రాదు.

ఎలర్జీ వల్ల కలిగే ఇబ్బందులు

  • ఎలర్జీల వల్ల తుమ్ములు ఎక్కువగా వస్తాయి..ముఖం ఎర్రగా అవుతాయి
  • జలుబుతో కళ్లు ఎర్రగా అవుతాయి. ముఖం మీద దురదలు వస్తాయి.
  • గొంతు అంత ఇరిటేషన్ గా ఉంటుంది.
  • ముక్కు అంతా బిగిసిపోతుంది..కొన్నిసార్లు వాసనకూడా తెలియదు.
  • నిద్రపట్టదు, ఆయాసం వస్తుంది..నోరు తెరుస్తారు..ఇంకా డస్ట్ లోపలకి వెళ్తుంది.
  • మూడ్ మంచిగా ఉండదు. మనం జలుబు చేసినప్పుడు చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది.

ఎలర్జీలు వచ్చినప్పుడు ఏం చేయాలి.. అసలు రాకుండా ఉండాలంటే.. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి

ఎలర్జీలు వచ్చే వారికి ఉన్న కామన్ హ్యాబిట్ వాటర్ తక్కువగా తాగటం. మంచినీళ్లు తక్కువగా తాగేవారికి శరీరంలో ఉన్న నీటిని బయటకు పంపించకుండా, నీరు బయటకు పోకుండా ఆపడానికి..కొన్ని హిస్టమిన్స్ రిలీజ్ అవుతాయి..ఇవి ఎక్కువ రిలీజ్ అయితే..ఎలర్జీలు ఎక్కువగా వస్తాయి. అందుకని రోజుకు కనీసం 4 లీటర్లు అయినా వాటర్ తాగాలి.

సూత్రనేతి, జలనేతి అని సర్జికల్ షాపుల్లో అమ్ముతారు. ట్యూబ్ లా ఉంటుంది. ముక్కులో తోసెస్తే..నోట్లోకి వచ్చేస్తుంది. మ్యాజిక్ షోలో చేస్తుంటారు. ఇలా ముక్కులోంచి నోటిలోకి తాడుతో లాగుతుంటే ముక్కులో బ్లాక్ అయినా రొంపలు, గొంతులో పేరుకున్న శ్లేష్మాలు బయటకు వస్తాయి. ఆ తర్వాతా జలనేతి డబ్బాలో గోరువెచ్చని నీరు పోయాలి. అవసరమైతే పసుపు వేయొచ్చు. దాంతో ఒక ముక్కు ద్వారంలో పెడితే..మరొక ముక్కులోంచి నీళ్లు బయటకు వస్తాయి. ఇలా చేస్తే ఇరిటేషన్ బాగా తగ్గుతాయి.

వీటితోపాటు వేడినీళ్లతో ఆవిరిపట్టడం చేయడం చాలా మంచిది. పసుపు, యాకలిప్టస్ ఆయిల్ వేసిన ఆవిరి పీలిస్తే..చాలా హాయిగా ఉంటుంది. అప్పుడప్పుడు పిప్పరమెంట్ ఆయిల్ వాసన పీల్చవచ్చు.

డస్ట్ ఎలర్జీలు ఉండేవారు..ఆహారంలో ముఖ్యంగా పంచదార, చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింగ్ లు ఇవి మానేయాలి. ఇవి తగిలితే..శ్లేష్మం ఎక్కువ రిలీజ్ అవుతుంది. సాల్ట్ కూడా ఎంత వీలైతే అంత మానేయాలి. వీటితోపాటు రోజులో 45 నిమిషాలు పాటు బాడీకి కాస్త వ్యాయామం, ప్రాణాయామం చేస్తుంటే..అసలు ఎలర్జీలు రాకుండా చక్కటి పరిష్కారంగా ఉపయోగపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news