మాజీ సీఎం, స్వర్గీయ రాజకీయ నాయకురాలు, తమిళ ప్రజలు ముద్దుగా ‘పురుచ్చి తలైవి’ అని పిలుచుకునే జయలలితకు సంబంధించిన ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇందులో 27 కేజీల బంగారం, 1,116 కిలోల వెండి, రత్నాలు, వజ్రాభరణాలు, 10వేల చీరలు, 750 జతల చెప్పులు, 1672 ఎకరాల భూముల పత్రాలు, ఇళ్ల దస్తావేజులు, 8,376 పుసక్తాలు ఉన్నట్లు తెలుస్తోంది.
వీటన్నింటినీ 6 ట్రంకు పెట్టెల్లో తీసుకువచ్చి ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలుస్తోంది. వీటి విలువ ప్రస్తుతం రూ.4000 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.కాగా, వీటిని తమిళనాడు ప్రభుత్వం ఏం చేయనుందనే దానిపై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తున్నది.