పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

-

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్ద నెమలిపురిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంకర్ అదుపుతప్పి ఓ కారుపై పడిపోయింది.

accident

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ప్రకాశం జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.  కారు లో ప్రయాణిస్తున్న ప్రకాశం జిల్లా కు చెందిన తల్లి, మరియు ఇద్దరు కొడుకులు ప్రమాదంలో మృతి చెందారు.. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ నూరుల్లా,, షేక్ హబీబుల్లా, షేక్ నజీమా గా గుర్తించారు పోలీసులు. ట్యాంకర్ డ్రైవర్ నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటన కు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news