తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా 2023 డిసెంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో హామీల మేరకు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. అందులో ముఖ్యంగా కళ్యాణలక్ష్మీలో భాగంగా తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మంత్రి జూపల్లి ఆ విషయాల గురించి మాట్లాడుతూ తడబడ్డారు. నెలకు రూ.6,500 కోట్లు ముఖ్యమంత్రి కేటీఆర్ నాయకత్వం అని తడబడి.. మల్లీ రేవంత్ రెడ్డి అంటూ సంబోధించారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్ వేశారు. జూపల్లి మాట్లాడుతూ సీఎం కేటీఆర్ అని పొరపాటున వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ త్వరలోనే మంత్రి జూపల్లిని క్యాబినెట్ నుంచి తొలగిస్తారని సెటైరికల్ పోస్టు చేశారు.