మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

-

మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ను కోరినట్టు తెలిపారు. మిర్చికి రూ.11,6000 పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. మార్కెట్ రేటుకు, రైతుల పెట్టుబడి వ్యయానికి మధ్య ఉన్న గ్యాప్ ను కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆదుకోవాలని చూస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. 

ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి అచ్చం నాయుడు, ఏపీ వ్యవసాయ శాఖ అధికారులు వర్చువల్ గా హాజరయ్యారు. సమావేశం అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. రైతుల కష్టం తెలిసిన వ్యక్తి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ ఛౌహన్.. నిన్న ఢిల్లీలో లేనప్పటికీ మధ్యప్రదేశ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడారు. ఇవాళ ఢిల్లీ వచ్చిన వెంటనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news