సైబర్ నేరాలను మీరే ఎదుర్కోవచ్చు అని తెలంగాణ పోలీస్ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఇటీవలే కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీ ని ఉపయోగించుకొని కొత్త కొత్త స్కామ్ లకు పాల్పడి అమాయక ప్రజలను సైబర్ నేరాల భారీన పడేస్తున్నారు. కృతిమ మేధ సాయంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి, అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కూడా అమాయకులే కాక సాప్ట్ వేర్ ఉద్యోగులు సైతం మోసపోతూనే ఉన్నారు.
వీటిపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు తెలంగాణ పోలీసులు సోషల్ మీడియా ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ప్రత్యేక ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సైబర్ నేరాలపై సలహాలు ఇస్తూ.. స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో సైబర్ నేరాలను మీరే ఎదుర్కోవచ్చని.. సైబర్ నేరానికి గురవ్వకుండా కాపాడుకోవడం చాలా సులభం అని చెప్పుకొచ్చారు. సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని.. మీ సన్నిహితులకు అవగాహన కల్పించాలని, ఈజీ మనీ కోసం ఆశ పడొద్దని, ఎవరైనా బెదిరిస్తే.. భయపడొద్దని సూచనలు చేసింది.