ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. చెత్త పన్ను రద్దు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్నును రద్దు చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

2024 డిసెంబర్ 31 నుంచి రద్దు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని ఇళ్ల నుంచి నెలకు రూ.30 నుంచి రూ.150 చొప్పున చెత్త పన్ను వసూళ్లు చేసిన సంగతి తెలిసిందే.