కారు పక్కకు తీయమన్నందుకు పెట్రోల్ బంక్ వర్కర్‌పై కాంగ్రెస్ నేత దాడి

-

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో కిందిస్థాయి కేడర్, నాయకులు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నట్లు పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెట్రోల్ బంక్‌కు కారు అడ్డంగా పెట్టిన ఓ కాంగ్రెస్ నేతను అందులో పనిచేసే వర్కర్ పక్కకు తీయాలని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత విజయ్ ఆ వర్కర్ చెంప చెల్లుమనిపించాడు.

రెండు సార్లు అదేవిధంగా చెంప మీద కొట్టడంతో ఆ వర్కర్ కిందపడిపోయాడు. తనను కొట్టొద్దని వేడుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కాగా, సదరు కాంగ్రెస్ నేతపై చర్యలు తీసుకోవాలని పెట్రోల్ బంక్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.

https://twitter.com/TeluguScribe/status/1893533171666559371

Read more RELATED
Recommended to you

Latest news