ఈనెల 27న తెలంగాణలో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతామని కారణంతోనే గులాబీ నేతలు పోటీకి దూరంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు, కులగణన సర్వే మీద మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ‘మాకు రాజకీయాలు, ఎన్నికలు ముఖ్యం కాదు..బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసమే కులగణన సర్వే చేశాం.మీరు రాజ్యాంగ సవరణ చేయడానికి సిద్ధమా? అని బీజేపీని అని ప్రశ్నించారు.
ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కార కోసం కమిషన్ ఏర్పాటు చేశాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతాం’ అని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.