గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియా కు కీలక విజ్ఞప్తి చేశారు. హిందువుల తరపున మాట్లాడినందుకు తన సోషల్ మీడియా ఖాతాలు నిషేదించారని.. ఈ వ్యవహారంలో తనకు సపోర్ట్ చేయాలని మీడియాను కోరారు రాజాసింగ్. హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న అణచివేతను, పక్షపాతాన్ని పూర్తిగా ఖండించాలని అన్నారు. మహిందువులకు జరుగుతున్న అణచివేతపై తాను ఆందోలన వ్యక్తం చేసినందుకు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను సమర్తించినందుకే తన సోషల్ మీడియా ఖాతాలన్నీ శాశ్వతంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
యూఎస్ ఆధారిత సంస్థ ఒకటి, ఇండియా హేట్ ల్యాబ్ ద్వారా నిధులు పొందుతున్నది, నన్ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకొని తన ఖాతాలు తొలగించబడటమే కాకుండా తన కుటుంబ సభ్యులు, స్నేహితులు కార్యకర్తలు ఖాతాలు కూడా నిషేదించారని మండిపడ్డారు. హిందువుల తరపున మాట్లాడేవారి గొంతు నొక్కే ప్రయత్నం ఇదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వేషపూరిత ప్రసంగం ఆధారంగా నిషేదించామని చెప్పుకునే సంస్థలు, ప్రపంచ వ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు, హింసను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.