ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

ఇందులో భాగంగానే… ఇవాళ ఉదయం 9.30 గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు జగన్. అటు రేపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ పెట్టనుంది చంద్రబాబు కూటమి సర్కార్.