కృష్ణా నీటి వాటాలపై KRMB కీలక సమావేశం ఉంది. ఈ రోజు మ.3:30కి హైదరాబాద్ జలసౌధలో KRMB సమావేశం ఉండనుంది. ఈ కృష్ణా నీటి వాటాలపై KRMB కీలక సమావేశం కు ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు హాజరుకానున్నారు. ఇక ఇప్పటికే తమ వాదన వినిపించింది తెలంగాణ. నిబంధనలు ఉల్లంఘించి ఏపీ అధికంగా నీటిని తరలిస్తోందని తెలంగాణ ఫిర్యాదు చేసింది.

నీటి తరలింపు తక్షణమే ఆపాలంటున్న తెలంగాణ… కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఇక ఇలాంటి నేపథ్యంలో నేడు తమ వాదన వినిపించనున్నారు ఏపీ అధికారులు. దీంతో కృష్ణా నీటి వాటాలపై KRMB కీలక సమావేశంపై అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది.