తిరుపతిలో అన్నదాన కేంద్రంలో స్పృహ కోల్పోయి బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తిరుమలలో శనివారం సాయంత్రం అన్నదాన కేంద్రంలో ఓ బాలుడు అనుకోకుండా స్పృహ తప్పి పడిపోయాడు.
దీంతో వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న స్విమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతున్న బెంగళూరుకు చెందిన బాలుడు(16) పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించగా..ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాలుడి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కొడుకు మృతితో బాలుడి పేరెంట్స్, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తిరుమలలో ఆలస్యంగా వెలుగులోకి దారుణ ఘటన
శనివారం సాయంత్రం అన్నదాన కేంద్రంలో కిందపడిపోయి స్పృహ కోల్పోయి.. స్విమ్స్‌లో చికిత్స పొందుతూ బెంగళూరుకు చెందిన బాలుడు(16) మృతి
కన్నీరుమున్నీరుగా విలపించిన బాలుడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు pic.twitter.com/3VmwvnjdaJ
— greatandhra (@greatandhranews) February 25, 2025