ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు, వ్యాపారులు ఫుడ్ ఐటమ్స్‌ను ఎంగిలి చేసి వినియోగించడం చూసే ఉంటాం. శీతల పానీయాలను సైతం కలుషిత చేసి విక్రయించి దొరికిపోయిన ఘటనలు అనేకం సోషల్ మీడియాలో వెలుగుచూశాయి.ఉత్తరాదిలో ఓ వ్యక్తి చెరుకు రసంలో మూత్రం కలిపి విక్రయించిన ఘటనలు చూశాం. తాజాగా ఓ బస్సు డ్రైవర్ ప్రయాణికులు తాగే వాటర్ బాటిల్స్‌లోని నీటిని ఎంగిలి చేస్తున్న దృశ్యాలను ఓ ప్యాసింజర్ గుర్తించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
వివరాల్లోకివెళితే.. ఓ ప్రయాణికుడు హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్లేందుకు రేష్మ టూరిస్ట్ ట్రావెల్ బస్ ఎక్కాడు. అయితే, బస్సు డ్రైవర్ ఒక్కో బాటిల్ మూత తీసి వాటర్ నోటిలోకి సగం తీసుకోని వేరే వాటర్ బాటిల్లో నోటిలోని నీటితో నింపుతున్నాడు. ఇదంతా గమనించిన ఓ ప్రయాణికుడు గమనించి ప్రశ్నించగా సమాధానం ఇవ్వలేదు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతోంది.
https://twitter.com/ChotaNewsApp/status/1893597745619009689