భక్త కన్నప్ప సినిమా స్టోరీ లీక్ చేశారు హీరో మంచు విష్ణు. నాస్తికుడు శివభక్తుడైతే ఏ విధంగా ఉంటుందో సినిమా లో చూపించామంటూ హింట్ ఇచ్చారు. శ్రీకాళహస్తీశ్వరున్ని మోహన్ బాబు, మంచు విష్ణు, ప్రభుదేవా దర్సించుకున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడారు. ఎన్నో ఏళ్ల తరువాత శ్రీకాళహస్తికి వచ్చానని తెలిపారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భక్తుల కోసం అద్బుతమైన ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు.

ఏఫ్రిల్ 25న భక్త కన్నప్ప సినిమా విడుదల అవుతుందని తెలిపారు. మార్చి 1న టీజర్ విడుదల చేస్తున్నామన్నారు. భక్తకన్నప్ప ప్రేక్షకుల అంచనాను మించే ఉంటుందన్న నమ్మకం ఉందని చెప్పారు. శ్రీకాళహస్తీశ్వరున్ని తరువాత మనస్సుకు ఎంతో ప్రశాంతంగా ఉందని… ఆలయం మొత్తం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని కొనియాడారు. శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలో పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ అద్భుతంగా ఉందన్నారు. భక్త కన్నప్ప సినిమాను ప్రతి ఒక్కరు చూడాలి… భక్త కన్నప్ప అద్భుతమైన చిత్రం అని వివరించారు.