వేడి సాంబార్లో పడిన బాలుడు తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామంలో గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..భీంగల్ పట్టణానికి చెందిన కర్నె నిహారిక తన మూడేళ్ల వయసున్న కొడుకుతో కలిసి ఈ నెల 19న ముచ్కూర్లో బంధువుల ఇంట్లో జరుగుతున్న ఓ శుభకార్యానికి హాజరైంది.

అక్కడ పిల్లలతో కలిసి బాలుడు చార్విక్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడిగా ఉన్న సాంబార్ బాండీలో పడిపోయాడు. దీంతో బాలుడి శరీరం మీద చర్మం ఊడి రావడంతో వెంటనే చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చార్విక్ మృతి చెందగా.. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.