తెలంగాణలో కొందరు ప్రైవేట్ డైరీ వారు ‘విజయ’ పేరుతో ‘విజయ తెలంగాణ’ పాల ప్యాకెట్లను విక్రయిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విజయ తెలంగాణ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయ పేరుతో అమ్ముతున్న నకిలీ పాల ప్యాకెట్లను కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించారు.
రజలు విజయ తెలంగాణ అని బ్రాండ్ ఉంటేనే పాలను కొనుగోలు చేయాలని, విజయ బ్రాండింగ్ పేరు, లాఫింగ్ కౌ లోగోను వాడుకుంటూ పాలను విక్రయించే హక్కు జిల్లా యూనియన్లు, ప్రైవేటు సంస్థలకు లేదని హెచ్చరించారు. విజయ బ్రాండు ప్రైవేట్ డెయిరీలు వినియోగించడం చట్టరీత్యా నేరమని గుత్తా అమిత్ రెడ్డి స్పష్టంచేశారు.
https://twitter.com/Congress4TS/status/1894793850318635215