టెక్నాలజీ మారినా మనిషి అవసరం ఎప్పటికీ మారదు : కేటీఆర్

-

టెక్నాలజీ ఎంత మారినా మనిషి అవసరం ఎప్పటికీ మారదని.. అందుకు అనుగుణంగా నూతన ఆవిష్కరణలు రావాలని, సాంకేతికత అభివృద్ధి చెందితేనే సమాజానికి మేలు కలుగుతుందని మాజీ ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.‘ఎంట్రప్రెన్యూర్ టెక్ & ఇన్నోవేషన్ సమిట్ – 2025’లో ‘డ్రైవింగ్ డిజిటల్ ఇండియా..టెక్నాలజీ అభివృద్ధికి మార్గదర్శకాలు,ఆవిష్కరణలు’ అనే అంశంపై ఆయన కీలక ఉపన్యాసం చేశారు.

బెంగళూరులో గురువారం జరిగిన ఈ సదస్సులో టెక్ లీడర్స్, పాలసీ మేకర్లు, స్టార్టప్ వ్యవస్థాపకులతో కేటీఆర్ ముచ్చటించారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. కానీ, ప్రతి సాంకేతిక ఆవిష్కరణ వెనుక మానవ అవసరాలు,నైతిక విలువలు నిలకడగా ఉండాలని స్పష్టంచేశారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ బాడీస్ వంటి సాంకేతికతకు ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందో వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news