వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై మరో కేసు నమోదు అయ్యింది. గన్నవరం నియోజకవర్గంలోని పలు స్టేషన్లలో ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా.. తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. గన్నవరం శివారు మర్లపాలెంలో సుమారు 18 ఎకరాల్లో పానకాల చెరువు భూమిని సాగు చెసుకుంటున్న రైతులనుండి దౌర్జన్యం చేసి తమ భూములను లాక్కున్నారని ఆరోపణలు వచ్చాయి.
2023లో అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తన అనుచరులతో కలిసి భూములను ఖాళీ చేయాలని రైతులపై దౌర్జన్యానికి చేశారు అని ఆరోపణలో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరిపి అమ్ముకున్నారు అని.. చెరువు భూమికి ప్రత్యామ్నాయంగా రైతులకు వేరే చోట భూమి ఇస్తామని తొలుత చెప్పి.. తర్వాత పట్టించుకోలేదు అని మర్లపాలెం గ్రామానికి చెందిన జాస్తి మురళీకృష్ణ ఫిర్యాదు చేసారు. జాస్తి మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు ఏ1గా వల్లభనేని వంశీని, ఏ2గా అనగాని రవి, ఏత్తిగా రంగా, ఏ4గా శేషు, ఏ౦గా మేచినేని బాబు పేర్లను చేర్చి కేసు నమోదు చేసారు పోలీసులు.