Collapsed building in Hyderabad Central University: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కుప్పకూలిన భవనం కూలింది. HCUలో న్యూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా సెంట్రింగ్ కూలింది. నిర్మాణ దశలో ఉన్న భవనం కూలిపోయింది.

నలుగురు భవన నిర్మాణ కార్మికులకు గాయాలు అయ్యాయి. నిర్మాణానికి నాసిరకం వస్తువులు వాడటం వల్ల సంఘటన జరిగింది అంటున్నారు విద్యార్థి సంఘాలు. అయితే ఈ న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సెక్యూరిటీ దౌర్జన్యంకు దిగింది. నిర్మాణ దశలో ఉన్న భవనం కూలిపోవడంతో కవరేజ్ కి మీడియా ప్రతినిధులు వచ్చారు. దింతో మీడియా ప్రతినిధులపై బూతులు మాట్లాడుతూ కొట్టడానికి వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది.. రచ్చ చేసింది.