మంత్రి జూపల్లి అనుచరులు వీరంగం సృష్టించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొల్లాపూర్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతున్న కార్యకర్తపై మంత్రి జూపల్లి అనుచరులు దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి కొల్లాపూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుజ్జల పరమేశ్‌ను తీవ్రంగా కొట్టి, కిందేసి తన్ని కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
అయితే, రాత్రి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందిన పరమేశ్ శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యాడు. విషయం తెలిసిన వెంటనే పరమేశ్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. దాడి చేస్తున్న సమయంలో పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారని బాధితుడు ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని కవిత హెచ్చరించిన హెచ్చరించారు.
https://twitter.com/TeluguScribe/status/1895337575386075533