కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాల్లేవు : మీనాక్షి నటరాజన్

-

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నేడు ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆమెకు స్వాగతం పలకడానికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు కీలక నేతలు వెళ్లారు. అనంతరం మీనాక్షిని సాదరంగా ఆహ్వానించి తీసుకొచ్చారు.

ఈ సందర్బంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు లేవు..పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ.పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి.అందరి అభిప్రాయాలకు సముచిత స్థానం ఉంటుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తా. రాహుల్ గాంధీ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తా’ అని మీనాక్షి నటరాజన్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news