సహజంగా పిల్లలు ఎంతో అల్లరి చేస్తూ, మాట్లాడుతూ ఉంటారు కాకపోతే కొన్ని సందర్భాలలో వారి ఆత్మవిశ్వాసం ఎంతో తక్కువగా ఉంటుంది. అలా కాకుండా ఎంతో మంచి భవిష్యత్తుని పొందాలంటే పిల్లలకు కొంత స్వేచ్ఛను తప్పకుండా ఇవ్వాలి. పిల్లలను పెంచే విధానం ప్రకారం వారి ఎదుగుదల ఉంటుంది మరియు పిల్లలను పెంచడం అస్సలు సులువు కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రవర్తన ప్రకారం పిల్లలు నడుచుకుంటారు. కనుక తల్లిదండ్రుల వ్యక్తిత్వం, ప్రవర్తన వంటివి తప్పకుండా బాగుండాలి. కనుక పిల్లల వ్యక్తిత్వం కోసం పెంపకం లో మార్పులను చేయాలి.
చాలా శాతం మంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో నిర్ణయాలను ఎంతో త్వరగా తీసుకుంటారు. అలా కాకుండా వారి పిల్లల అభిప్రాయాన్ని కనుక్కొని దాని ప్రకారం నిర్ణయాన్ని తీసుకోవడం వలన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా పిల్లలకు మంచి విషయాలను నేర్పుతూ తల్లితండ్రులు తప్పులు చేయడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. కనుక తప్పులు చేయకుండా సరైన మార్గంలో నడిపించాలి. తల్లితండ్రులు అందరితో మాట్లాడుతూ ఉంటారు, కానీ పిల్లలను మాట్లాడమని ఎవరు ప్రోత్సహించరు. ఇతరులతో మాట్లాడించడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కనుక చుట్టాలతో, బంధువులతో మీరు మాట్లాడుతున్నప్పుడు పిల్లలను కూడా పాల్గొనమని ప్రోత్సహించండి.
ఈ విధంగా జీవితంలో ఎదుగుదల ఉంటుంది. సహజంగా పిల్లలు ఎంతో ఉత్సాహంగా చుట్టూ ఉండేటువంటి విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు మరియు ఎన్నో అభిప్రాయాలకు వస్తారు. కాకపోతే వాటిని వ్యక్తం చేయరు, కానీ కొంతమంది వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తున్నా తల్లిదండ్రులు వారి మాటలను అడ్డుకుంటారు. అలా కాకుండా పిల్లల ప్రశ్నలకు తిరిగి జవాబు ఇవ్వడం మరియు అభిప్రాయాలను పంచుకోవడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే పిల్లల ఆత్మవిశ్వాసం పెరుగుతుందో వారి అభిప్రాయాలను ఇతరులతో పంచుకుంటారు మరియు సరైన విధంగా వ్యక్తం చేస్తారు. కనుక వారి మాటలకు విలువ ఇవ్వడం మరియు అభిప్రాయాలను పంచుకోమని ప్రోత్సహించడం వంటివి చేయాలి. ఇలా చేయడం వలన పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.