సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో హెల్త్ టూరిజం పాలసీని తీసుకురానున్నామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని హెల్త్ హబ్‌గా మార్చాలన్నదే మా ప్రయత్నం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హెల్త్ ప్రొఫైల్‌తో కార్డ్‌లను అందించేలా చర్యలు తీసుకుంటున్నారు పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో వరంగల్ కి ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిం చారు. వరంగల్ కి ఎయిర్ పోర్టు కావాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని నేనే అడిగా.. భూసేకరణ ను క్లియ ర్ చేసి ఎయిర్ పోర్టు, రింగ్ రోడ్డు కావాలని ఢిల్లీలో నివేదికలు అందించాకే కదలిక వచ్చింది. ఢిల్లీకి ఇందుకే వెల్తున్నాం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నేనే సాధించా. రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం ఎన్ని సార్లు అయినా ఢిల్లీకి వెళ్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.