అవును అబుదాబి వెళ్లా.. సీఎం రేవంత్‌కు హరీశ్ రావు కౌంటర్

-

ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదానికి బీఆర్ఎస్ పార్టీ కారణమని, ఆ పార్టీ నేతలు నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని సీఎం రేవంత్ నిన్న చేసిన వ్యాఖ్యలకు గాను తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘అవును అబుదాబి వెళ్లాను!!!స‌న్నిహిత మిత్రుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి కూతూరి పెళ్లికి వెళ్లా..మీ మంత్రిలా క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికి.. విహార యాత్ర‌ల‌కు వెళ్ల‌లేదు.

ఘ‌ట‌నా స్థ‌లానికి మంత్రులు వెళ్ల‌కుండా ఎన్నిక‌ల ప్ర‌చారానికి హెలికాఫ్ట‌ర్ తీసుకెళ్లింది ఎవ‌రు? హెలికాఫ్ట‌ర్ లేద‌ని ఉత్త‌మ్ హైద‌రాబాద్‌లోనే ఉన్నారు. నేను అబుదాబికి వెళ్ళింది ఫిబ్రవరి 21న..ప్ర‌మాదం జరిగింది ఫిబ్రవరి 22న‌. నేను ఎస్ఎల్‌బీసీకి వెళ్తే అడ్డుకుని ఇప్పుడు నీచ‌ రాజ‌కీయాలు చేస్తారా? ప్ర‌మాదం జ‌రిగి ఇన్ని రోజులైనా మృత‌దేహాలు వెలికితీయ‌డం చేతకాని ప్ర‌భుత్వం ఇది’ అని సీఎం రేవంత్‌కు హ‌రీష్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news