రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో దేవిక అనే నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన దేవిక స్వస్థలం వికారాబాద్. 7 నెలల క్రితం శరత్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది దేవిక. ఎంబీఏ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది దేవిక. అటు ఐఐటి ఖరగ్పూర్ లో చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు శరత్. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆగస్టు నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు శరత్, దేవిక.

గత కొన్ని రోజుల నుంచి శరత్ దేవికల మధ్య పరస్పర గొడవలు జరుగుతున్నాయట. ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది దేవిక. ఇక దేవిక మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు. కట్నం కోసం శరత్ తమ కూతురు దేవికను వేధించేవాడని ఆరోపిస్తున్నారు దేవికా తల్లి. 5 లక్షల కట్నం 15 తులాల బంగారం ఇచ్చిన కూడా అదనపు కట్నం కోసం వేధించడంతో మానసికంగా కృంగిపోయి దేవిక ఆత్మహత్యకు పాల్పడినట్లు దేవిక కుటుంబ సభ్యుల ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు… మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.