తిరుపతిలో మరోసారి చిరుత సంచారం కలకలం

-

తిరుపతిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి మెట్ల మార్గంలో గాలి గోపురం షాపుల దగ్గర తెల్లవారుజామున ఒంటి గంటకు చిరుత పులి కదలికలు కనిపించాయి. అక్కడే ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల్లో చిరుత వెళ్తున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులు వ్యాపారస్తులు, భక్తులను మరోసారి హెచ్చరించేందుకు సిద్ధమయ్యారు.

గతంలో అలిపిరి మెట్ల మార్గం వద్ద చిరుత సంచారంతో పాటు భక్తులపై దాడికి పాల్పడింది. అనంతరం గత వైసీపీ సర్కార్ చిరుతను పట్టుకోకుండా భక్తులకు చేతి కర్రలు ఇచ్చి పంపించింది అని పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా చిరుత సంచారంతో ప్రభుత్వం, టీటీడీ భక్తుల సేఫ్టీ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news