తెలంగాణ రాష్ట్రంలో మరో విషాదం చోటు చేసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అవుతుందనే భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్ పల్లి గ్రామానికి చెందిన హాసిని (18) చెన్నూరులోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదివేది,

చదువు ఇష్టం లేక ఇంటికి రావడంతో విద్యార్థిని తండ్రి ఆమెను బలవంతంగా మంచిర్యాలలోని ప్రైవేట్ కళాశాలలో చేర్పించాడు. అయితే ఇంటర్ పరీక్షలు దగ్గర పడుతుండడంతో, ఫెయిల్ అవుతానని భయపడ్డ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
కాగా రేపటి నుంచే తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. రేపు ఉదయం 9 నుండి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 9 లక్షల 96,971 మంది తెలంగాణ రాష్ట్ర ఇంటర్ పరీక్షలు రానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,88,448 ఉండగా…. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5, 08,523 మంది ఉన్నారు. మొత్తం పరీక్ష కేంద్రాలు 1532 ఏర్పాటు చేస్తున్నారు. ఇన్విజిలేటర్స్ 29,992 మంది ఉంటారు.
పరీక్షల్లో ఫెయిల్ అవుతుందనే భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్ పల్లి గ్రామానికి చెందిన హాసిని (18) చెన్నూరులోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదివేది, చదువు ఇష్టం లేక ఇంటికి రావడంతో విద్యార్థిని తండ్రి ఆమెను బలవంతంగా మంచిర్యాలలోని… pic.twitter.com/XI0jvaT3ar
— Telugu Scribe (@TeluguScribe) March 4, 2025