గాదె శ్రీనివాసులు గెలుపుపై వివాదం నెలకొంది. గాదె శ్రీనివాసులు విజయంపై పొలిటికల్ వార్ కొనసాగుతోంది. ఒకవైపు తన గెలుపుకు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదన్నారు గాదె శ్రీనివాసులు. మరో వైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటో లతో ప్రచారం చేసి గాదె గెలిచారు అంటున్నారు మంత్రి అచ్చెన్నాయుడు.

ఇక కూటమి అభ్యర్థి రఘువర్మ ఓడిపోయారంటూ ప్రచారం చేసుకుంటోంది వైసీపీ పార్టీ. వైసీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి మూడో స్థానానికి పరిమితం అయ్యారంటోంది టీడీపీ పార్టీ. ఇది ఇలా ఉండగా… ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తానని ప్రకటించారు గాదె శ్రీనివాసులు. నా గెలుపు కోసం అన్ని ఉపాధ్యాయ సంఘాలు పనిచేశాయన్నారు. నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు గాదె శ్రీనివాసులు.