బ్రేకింగ్ : తెలంగాణ ఎమ్మెల్యేకు ‘న్యూడ్ కాల్’.. అందరికీ లీక్!

-

సైబర్ నేరగాళ్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. టెక్నాలజీ సాయంతో కొత్త కొత్త పద్ధతులను ఫాలో అవుతూ మోసాలకు పాల్పడుతున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వీరి బారిన పడి చాలా మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ఏకంగా పరువు కోసం ఆత్మహత్యలకు సైతం పాల్పడిన ఘటనలు ఉన్నాయి.

తాజాగా తెలంగాణ ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్లు న్యూడ్ కాల్ చేసినట్లు తెలిసింది.ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆయన ఫోన్ ఎత్తగానే రికార్డింగ్ చేశారు. అనంతరం డబ్బులు పంపాలంటూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్పందించకపోవడంతో న్యూడ్ వీడియో కాల్ రికార్డింగ్‌ను ఆయన ఫోన్ కాంటాక్ట్స్‌కు సైబర్ నేరగాళ్లు పంపించినట్లు తెలిసింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news