వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.గతంలో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.
విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే విచారణకు హాజరు కావాలని తాజాగా సీఐడీ నోటీసులు జారీ చేయగా.. దాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కాగా, వైసీపీ అధికారంలో ఉన్న టైంలో టీడీపీ, జనసేన నేతలను ఆర్జీవీ పలుమార్లు కించపరిచిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇప్పుడు లీగల్గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.