కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యకు పెద్దపీట : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

-

గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం కౌకుంట్ల మండలం అప్పంపల్లి పాఠశాల, దేవరకద్ర మండల కేంద్రం లోని బాలుర ఉన్నత పాఠశాలలో జిఎంఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో.. విద్యార్థులకు స్టడీ మెటీరియల్, సైకిల్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హాయంలో పాఠశాలలో మౌలిక వ్యవస్థలను పట్టించుకోలేదని, పదేళ్ల పాలనలో టీచర్ల నియామకాలను చేపట్టలేదన్నారు. విద్యాశాఖకు నిధులు కేటాయించలేదని బిఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ చరిత్రలో ఎన్నడు లేని విధంగా విద్యాశాఖకు అధిక నిధులు కేటాయించడంతో పాటు..11,062 టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు. 15 ఏళ్ల తర్వాత సుమారు 19000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలలో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో గత పాలకులు పదేళ్లు అధికారంలో ఉండి కనీసం డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయలేకపోయారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news