ఇవాళ పోలీసుల ఎదుట హాజరు కానున్నారు గోరంట్ల మాధవ్. ఇందులో భాగంగానే… కర్నూలు నుంచి విజయవాడకు బయలు దేరారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఇవాళ ఉదయం 10:30 గంటలకు స్తెబర్ క్త్రెం పోలీసులు ఎదుట హాజరు కానున్నారు మాధవ్. పోక్సో కేసులో బాధితురాలి పేరు ప్రస్తావించడంపై సైబర్ క్రైమ్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ. అటు వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు గోరంట్ల మాధవ్ పై కేసు నమోదు చేశారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు.

ఇప్పటికే సెక్షన్ 35/3బిఎన్ఎస్ఎస్ కింద గోరంట్ల మాధవ్ కు నోటీసులు అందాయి. అలాగే… గోరంట్ల మాధవ్ పై 72, 79 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు కావడం జరిగింది. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు విజయవాడ పోలీసులు. వ్యక్తిగత కారణాల వల్ల నిన్న విచారణకు హాజరు కానీ మాధవ్…. ఇవాళ ఉదయం 10:30 గంటలకు స్తెబర్ క్త్రెం పోలీసులు ఎదుట హాజరు కానున్నారు.