నేడు జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెళ్లనున్నారు. వైసీపీ పార్టీ నుంచి ఇతర పార్టీలకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నేడు జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఐదు రోజుల క్రితం పవన్ కళ్యాణ్‌ను కలిసి పార్టీలోకి వస్తానని కోరిన ఆయన.. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను పార్టీ మారుతున్నట్లు చెప్పడం విశేషం.

దొరబాబుతో పాటు పిఠాపురం జడ్పీటీసీ సభ్యుడు బుర్రా అనుబాబు కూడా జనసేన పార్టీ కండువాను కప్పుకోనున్నారు. పిఠాపురం నుంచి మంగళగిరి జనసేన కార్యాలయానికి బయలుదేరారు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు పవన్ సమక్షంలో జనసేనలో చేరనన్నారు దొరబాబు. అనుచరులు స్థానిక ప్రజాప్రతినిధులతో కార్లతో ర్యాలీగా బయలుదేరారు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.