ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. దీంతో 39వ సారి ఢిల్లీకి వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ తరుణంలోనే… హైదారాబాద్ టూ ఢిల్లీ అప్ & డౌన్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి పై సెటైర్లు పేల్చుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. నిన్న రాత్రే హైదారాబాద్‌కు వచ్చి మళ్ళీ ఈరోజు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి.

నిన్న నేషనల్ మీడియా ఛానల్ ఇంటర్వూలో పాల్గొని రాత్రి హైదరాబాద్‌కు వచ్చారు రేవంత్ రెడ్డి. ఇక నేడు ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో భేటీ అవ్వడానికి ఈ రోజు రాత్రికి మళ్లీ ఢిల్లీకి వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఉన్నారు.