రాష్ట్రంలో నిరసనల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్ ముందు కాంట్రాక్టర్ల ఆందోళనకు దిగారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 200 మంది కాంట్రాక్టర్లు ఈ నిరసనలో పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం కోసం కనీసం అధికారులు 20 శాతం కమీషన్ అడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై డిప్యూటీ సీఎంతో మాట్లాడేందుకు వచ్చిన కాంట్రాక్టర్లను ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది ఆపడంతో కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ల ఆందోళన చేయడంతో సెక్రెటేరియట్ నుంచి భట్టి విక్రమార్క వెళ్లిపోయినట్లు సమాచారం.