తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు ఒక్కసారిగా హంగామా చేసింది. మొదటి ఘాట్ రోడ్డుపైకి వచ్చిన ఏనుగుల గుంపు కదలకుండా అలాగే ఉండిపోయింది. గమనించిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
మొదటి ఘాట్ రోడ్డు వద్ద గల 0ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఏనుగులు సంచరిస్తున్నట్లు భక్తులు, వ్యాపారులు గుర్తించారు.వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వగా ఏనుగులను తరిమేందుకు సిబ్బంది అక్కడకు చేరుకుని ప్రయత్నిస్తున్నారు. కాగా, ఇటీవల మెట్ల మార్గం వద్ద చిరుతపులి సంచరిస్తున్న వీడియో సైతం వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా, భక్తుల నడక మార్గంలో వన్యమృగాలు రావడంపై భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల కలకలం.
మొదటి ఘాట్ రోడ్డుపైకి వచ్చిన ఏనుగుల గుంపు.
ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర సంచరిస్తున్న ఏనుగులు.
ఏనుగులను తరిమేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బంది. pic.twitter.com/uOTsAXgiQJ
— greatandhra (@greatandhranews) March 8, 2025