కాంగ్రెస్ ప్రభుత్వం లో చిత్తశుద్ధితో ఉన్న పాలన కొనసాగుతోందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కు సంబంధించి ముగ్గురు మంత్రులతో పాటు వరంగల్ ఎంపీ కావ్య
తాను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ని కలిశామని, తెలంగాణకు రావాల్సిన రైల్వే ప్రాజెక్టు
లపై చర్చించామని తెలిపారు.
ముఖ్యంగా కాజీపేట రైల్వే డివిజన్ కావాలని కోరడం జరిగిందన్నారు. అలాగే విభజన హామీలలో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా నేరవేర్చాలని కోరామని అన్నారు. అంతేగాక కొన్ని రైల్వే లైన్లకు సంబంధించిన ప్రాజెక్టులను కూడా నెరవేర్చాలని, డోర్నకల్ నుంచి గద్వాల వరకు రైల్వే లైను, ఆర్ఆర్ఆర్ చుట్టూ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలనే ప్రతి పాధనను కూడా పెట్టినట్లు వివరించారు. కేంద్రమంత్రితో అన్నీ అంశాలపై చర్చ జరిపామని తెలిపారు.